ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరు తారస్థాయికి చేరింది. శనివారం హూతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ రాజధానిపై క్షిపణులు ప్రయోగించిన విషయం తెలిసిందే. దీనికి అమెరికా ప్రతీకార దాడులు చేసింది. యెమెన్ రాజధానిలో హూతీల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. హూతీల కార్యకలాపాలు దెబ్బతినేలా దాడులు నిర్వహించినట్లు అగ్రరాజ్యం పేర్కొంది. ఎర్ర సముద్రం, బాబ్ అల్ మాండెబ్, ఏడెన గల్ఫ్‌లో వ్యాపార నౌకలపై దాడులు చేసినట్లు తెలిపింది.