TG: రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నామినేటెడ్ పదవికి నేను అన్ని విధాలా అర్హురాలిని. బీసీ మహిళగా నాకు ఆ అర్హత ఉంది. నాకు పదవి ఇవ్వకుంటే PCC చీఫ్ని అడ్డుకుంటాను. గాంధీభవన్ మెట్ల మీద ధర్నా చేస్తా. నన్ను ఎమ్మెల్సీని చేస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరుగుతోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.