AP: రాష్ట్రంలో వరుస భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా ముండ్లమూరులో గత మూడు రోజుల నుంచి భూమి స్వల్పంగా కంపిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. నిన్న ఉదయం 10:41 గంటలకు కంపించిన భూమి మరోసారి రాత్రి 8:15 గంటలకు, 8:16 గంటలకు, 8:19 గంటలకు వరుసగా మూడు సార్లు కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.