జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్కి పాల్పడిందని మాజీ డిప్యూటీ సీఎం, BRS నేత మహమ్మద్ ఆలీ ఆరోపించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ, మజ్లీస్ కలిసి పోటీ చేశాయని, అందుకే తమకు ముస్లీం ఓట్లు పడలేదన్నారు. బీఆర్ఎస్ ఒక్కటిగా తలపడిందని పేర్కొన్నారు. ఎన్నిక కోసం కాంగ్రెస్ డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు చేసిందని చెప్పారు.