TG: ప్రస్తుతం ఫోన్ చేస్తే.. కాలర్ టోన్ గా ‘మీకు పోలీసులు, జడ్జిలు, వీడియో కాల్స్ చేస్తూ సైబర్ క్రైంలకు పాల్పడవచ్చు’ అంటూ వినిపిస్తోంది. అయితే అందులో జడ్జిలు, పోలీసులే నేరుగా కాల్ చేసి సైబర్ క్రైంలకు పాల్పడవచ్చు అనే అర్థం వస్తోంది. పోలీసులు, జడ్జిల పేరిట అని రావాల్సిన సమాచారం తప్పుగా వస్తోంది. ఈ తప్పును సవరించండంటూ BSNLసీజీఎంకు BRSనేత వినోద్ కుమార్ లేఖ రాశారు.