బలూచిస్తాన్‌లో హింస కొనసాగుతున్న తరుణంలో పాకిస్తాన్ భద్రతా దళాలు 11 మంది బలూచ్ పౌరులను బలవంతంగా అదృశ్యం చేశాయి. ఈ ఘటన డెరా బుగ్టి, పిర్కో ప్రాంతాల్లో చోటుచేసుకుంది. గడిచిన 2 రోజుల్లో వారిని బలవంతంగా తీసుకెళ్లారని బలూచ్ జాతీయ ఉద్యమ మానవ హక్కుల విభాగం పాంక్ తెలిపింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలవంతపు అదృశ్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.