TG: మంత్రి శ్రీధర్ బాబు వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. 2017లో కాళేశ్వరం దగ్గర జరిగిన గొడవలో పోలీసులు శ్రీధర్ బాబుపై కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కానీ కిందికోర్టులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చింది.