ఫెంగల్ తుఫాను ప్రభావంతో పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి ఎ నమచివాయం ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. ఫెంగల్ తుఫాను కారణంగా ప్రభావితమైన రేషన్ కార్డుదారులందరికీ ఒక్కొక్కరికి రూ.5 వేల ఆర్ధిక సహాయం, మృతులకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తామని సీఎం రంగస్వామి తెలిపారు.