మహారాష్ట్రలో ఓట్ల విషయంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఈసీని ఆశ్రయించింది. దీంతో హస్తం పార్టీకి ఈసీ సమాధానమిస్తూ మహారాష్ట్రలో ఓట్లను ఏకపక్షంగా చేర్చడం లేదా తొలగించడం చేయలేదని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. రాష్ట్ర ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకత, నిబంధనలు పాటించినట్లు వెల్లడించింది.ఓట్ల తొలగింపులో అవకతవకలేమీ జరగలేదని స్పష్టం చేసింది.