AP: గుంటూరు జిల్లా నీరుకొండలో ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని ఆర్5 జోన్ తీసుకొచ్చినట్లు విమర్శించారు. ఆర్5 జోన్లో పట్టాలిచ్చిన పేదలకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థలాలు కేటాయించినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టులో రాజధానిపై ఉన్న కేసులు పరిష్కరించేలా ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పాత కాంట్రాక్టుల రద్దుతో 6 నెలలు వృథా అయినట్లు తెలిపారు.