TG: ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది. ఈ పరిహారాన్ని రాష్ట్ర బడ్జెట్ నుంచే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదికలు పేర్కొనగా.. తాజా వర్షాలకు నష్టం మరింత పెరిగే అవకాశముంది.