AP: రాష్ట్రంలో స్టీల్రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తి చూపుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో జపాన్ రాయబారి ఒనో కేయిచ్చి సమావేశం నిర్వహించారు. ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం జపాన్ సహకారం కోరారు. జపాన్ పనితీరు తనకు ఎంతో ఇష్టమన్నారు.