తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత గణనీయంగా పెరిగింది. సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో చలిగాలులు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీలోని ఏజెన్సీల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు