AP: ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ప్రత్యేకమైన రోజని సచిన్ టెండూల్కర్ అన్నారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఎందరో మేధావులు ప్రపంచవ్యాప్తంగా భిన్న రంగాల్లో రాణిస్తూ భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. విద్యార్థులు ఈ చారిత్రక వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని, తమ ప్రతిభతో AU ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింతగా పెంచాలని ఆయన ఆకాంక్షించారు.