AP: రేషన్ ద్వారా ఇచ్చే పోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకం తగ్గించాలని మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. ‘ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలి. రాష్ట్రాలకు డేటా అందుబాటులో ఉండేలా చూడాలి. 5 శాతానికి మించి శ్లాబులో ఉన్న వస్తువులపై 1 శాతం ఫ్లడ్ సెస్ విధించాలి. ఫ్లడ్ సెస్ వల్ల పేదలు, మధ్యతరగతిపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ సెస్‌తో వరద ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపడతాం’ అని పేర్కొన్నారు.