నేడు శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. 225 మంది ఎంపీలను 1.70 కోట్ల మంది ఓటర్లు ఎన్నుకోనున్నారు. 2022 ఆర్థిల సంక్షోభం తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, సాఫీగా సాగేలా చూడడం కోసం దాదాపు 90 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. మొత్తం 13,314 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.