జనగామ: ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రైవేటు వ్యక్తులకు రైతులు తమ పంటని అమ్ముకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మొండ్రాయికి వెళుతున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి వాహనాన్ని మొండ్రాయి రైతులు ఆపి తాము పండించిన పంటకు ఈ ప్రభుత్వం బోనస్ ఇవ్వకపోగా, కనీసం మద్దతు ధర కూడా ఇవ్వనందున ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నామని తెలిపారు.