AP: దేశం సముద్ర శక్తికి అద్దంపట్టే విధంగా మన నౌకాదళం బలోపేతం అవుతుందని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కుమార్ అన్నారు. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం నౌకా దళానికి ఉందని తెలిపారు. భారత రక్షణ దళాల సామర్థ్యం, శత్రు భయంకరంగా వ్యవహరించగలిగే చర్యలు.. ఆపరేషన్ సింధూర్ ద్వారా రుజువు అయ్యాయని.. ఉదయగిరి, హిమగిరి నౌకలు ఒకేసారి నౌకాదళంలోకి ప్రవేశించడం శుభ పరిణామమని పేర్కొన్నారు.