AP: ఎలాంటి వారికి మద్దతిస్తున్నారో మాజీ సీఎం జగన్ ఆలోచించుకోవాలని హోంమంత్రి అనిత అన్నారు. కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయన్నారు. మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరని హెచ్చరించారు. తన సొంత తల్లి, చెల్లిని తిట్టిన వారిని జగన్ ఏం చేయలేకపోయారని కానీ తమ ప్రభుత్వం అరెస్టు చేస్తుందని తెలిపారు. జడ్జిలపై కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారని చెప్పారు. వాళ్లు పెట్టిన పోస్టులపై కోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు.