AP: రాజ్యసభ ఉపఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. వైసీపీ నుంచి పెద్దల సభలో అడుగు పెట్టిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది. నామినేషన్లకు ఈనెల 10 వరకు గడువు ఇచ్చారు. కాగా.. ఈ స్థానాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానాలో కూడా రాజ్యసభ ఉపఎన్నికలు జరగనున్నాయి.