TG: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారని గుర్తు చేశారు. కాలయాపన కోసం కమిటీలు వేసి ప్రభుత్వం కార్మికులను మభ్యపెడుతోందని ఆక్షేపించారు.