AP: మాజీమంతి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు జిల్లా ముత్తుకూరు పీఎస్‌లో పోలీసులు విచారించారు. సోమిరెడ్డిపై ఆరోపణలు, కార్టూన్ల ప్రచురణపై కాకాణిపై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై కృష్ణపట్నం సీఐ రవినాయక్ సమక్షంలో రెండున్నర గంటలపాటు ప్రశ్నించారు. ఆయనను సుమారు 54 ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో కాకాణి పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వనట్లు సమాచారం.