TG: కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 7న అసెంబ్లీ నిర్వహించి కులగణన సర్వేకు ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి అధికారులు అందించనున్నారు.