TG: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB)కి రామోజీ ఫౌండేషన్ రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ విరాళాన్ని రామోజీ ఫౌండేషన్ ట్రస్టీ సీహెచ్ కిరణ్ అందజేశారు. విరాళం సొమ్మును ఆడిటోరియం నిర్మాణానికి ISB వినియోగించనుంది. 430 సీట్ల అంతర్జాతీయ స్థాయి ఆడిటోరియం నిర్మించనుంది. ఈ నేపథ్యంలో రామోజీ ఫౌండేషన్‌కు ISB బోర్డు ఛైర్మన్ హరీశ్ మన్వాని కృతజ్ఞతలు తెలిపారు.