ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి(జూలై-సెప్టెంబర్) దేశ GDP 7.2 శాతం వృద్ధిని సాధిస్తుందని ప్రముఖ ఇండ్-రా నివేదిక తెలిపింది. బలమైన ప్రైవేట్ వినియోగం, సేవల రంగంలో స్థిరమైన వృద్ధి ఇందుకు దోహదపడ్డాయని అభిప్రాయపడింది. గతేడాది ఇదే సమయంలో దేశ జీడీపీ 5.6 శాతంగా, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అంచనాలను దాటి వృద్ధి 7.8 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.