హీరో మోటోకార్ప్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘విడా వీ2’ను లాంచ్ చేసింది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది 165 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.96,000గా ఉండగా, హైఎండ్ మోడల్ ధర రూ.1,35,000(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. రిమూవబుల్ బ్యాటరీతో వచ్చిన విడా వీ2 స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీలు. దీని బ్యాటరీని ఆరు గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.