భవిష్యత్తు తరాల సంస్కరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ‘ముఖ్యంగా రైతులు, సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని GST కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదించాం. GST ఫైలింగ్‌ను కూడా సరళతరం చేస్తున్నాం. కొత్త స్లాబ్‌లతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతుంది’ అని పేర్కొన్నారు.