AP: భోగాపురం ఎయిర్పోర్టుపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ పోటాపోటీ ట్వీట్లు చేస్తున్నారు. 2014-19 మధ్యే ఎయిర్పోర్టుకు నాంది పడిందని చంద్రబాబు అన్నారు. అయితే, భోగాపురం అనుమతులు తమ హయాంలోనే వచ్చాయని జగన్ పేర్కొన్నారు. భూసేకరణకు, పునరావాసం కోసం రూ.960 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వ కృషి వల్లేఈరోజు కీలక మైలురాయికి చేరుకుందని జగన్ తెలిపారు.