AP: పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో అన్నారు ‘ఇప్పటివరకు 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. మొత్తం 69,070 కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉచిత విద్యుత్‌కు రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అసైన్డ్ ల్యాండ్స్‌కు అక్రమ కనెక్షన్లు రద్దు చేస్తాం’ అని తెలిపారు.