AP: సీఎం చంద్రబాబు పోలవరం సందర్శనకు వెళ్లారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతి, నిర్వాసితుల పునరావాసం, పరిహారంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా.. 2027 డిసెంబరు నాటికి పోలవరం నిర్మాణ పనులు పూర్తి చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు చేపట్టబోయే పనుల షెడ్యూల్ను సీఎం ప్రకటించనున్నారు.