TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 8వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 23 వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు అత్యధిక మెజార్టీ విష్ణు పేరిట(2009లో 21,741) ఉంది. దివంగత MLA మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం నవీన్ ఈ మెజార్టీని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.