డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ 15వ సారి పెరోల్ మీద రిలీజయ్యారు. రోహతక్ సునరియా జైలు నుంచి డేరా బాబా పెరోల్‌పై బయటకు వచ్చారు. ఈ సారి 40 రోజుల పాటు ఆయనకు పెరోల్ మంజూరైంది. ఇద్దరు మహిళా భక్తులను రేప్ చేసిన కేసులో 2017లో దోషిగా తేలారు. దీంతో 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.