రోదసిలో భారత్ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి, శుక్రగ్రహానికి సంబంధించి వీనస్ ఆర్బిటర్ మిషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు ఇస్రో వెల్లడించింది. శుక్రయాన్ పార్టు1కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ISRO అహ్మదాబాద్, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ తెలిపారు. VOM మిషన్‌ను 2028లో ప్రయోగిస్తామన్నారు. గ్రహాల్లో జరిగే మార్పులు, భవిష్యత్‌లో ఇతర గ్రహాల మిషన్లపై ప్రయోగాలకు VOM ఉపకరించనుంది.