నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తన భార్యతో కలిసి బీచ్లో దిగిన ఫోటోను ఇన్స్టా వేదికగా ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఇ సుబ్బరాజు వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలియడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, అభిమానులు కొత్త జంటకు విషెస్ తెలియజేస్తున్నారు. అయితే సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి వివరాలు తెలియరాలేదు.