TG: ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు మహబూబ్నగర్లో జరిగే రైతు సదస్సును విజయవంతం చేయాలని మంత్రులు తుమ్మల, దామోదర, జూపల్లి అధికారులను ఆదేశించారు. మొదటి రెండు రోజులు 5 వేల చొప్పున రైతులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 30న సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని, అన్ని జిల్లాల నుంచి కనీసం లక్ష మంది రైతులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ యంత్ర సామగ్రి స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.