రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలోని పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ భూమిలో ఏ దేశమూ పరిష్కారాన్ని కనుగొనలేదని నొక్కి చెప్పారు. ప్రపంచంలో ఏక కాలంలో జరుగుతున్న రెండు ప్రధాన ఘర్షణల వల్ల అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితులను చూసి ప్రేక్షకుల్లా ఉండలేమని, పరిష్కారమార్గాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని తెలిపారు.