NLG: ధాన్యం సేకరణ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి, ఇంఛార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులను కోరారు. వానకాలం ధాన్యం సేకరణ పై మంగళవారం ఆయన న్యూ ఢిల్లీ నుండి పౌర సరఫరాల శాఖమంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో కలిసి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణలో భాగంగా అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేయ్యాలన్నారు.