VZM: మాజీ శాసనసభ్యులు తెంటు లక్ష్యం నాయుడు బుధవారం బొబ్బిలీ అర్బన్ అథారిటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్బంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి.