SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో ఎవరైనా సరే 100 డయల్ సేవలను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని ఎస్సై రమాకాంత్ అన్నారు. పోలీస్ శాఖ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 సర్వీస్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొన్ని రోజులుగా కొంతమంది వ్యక్తులు అనవసరంగా 100కు కాల్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు.