జామ ఆకుల టీని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకులతో తయారు చేసే టీ తాగడం వల్ల శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. దీంతో కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఫలితంగా క్యాన్సర్ గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.