AP: కూటమి సర్కారు కక్ష సాధింపులకు పాల్పడుతోందని.. తప్పుడు కేసులకు భయపడనని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ‘ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. ప్రజల్లోనే ఉంటా. ఎప్పుడైనా అరెస్టు చేసుకోవచ్చు.. ప్రజలు గమనిస్తూ ఉంటారు. నేను నూటికి నూరు శాతం ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటే వెళ్లా.. ఆ బిడ్డను పరామర్శిస్తే తప్పేంటి?’ అని చెవిరెడ్డి ప్రశ్నించారు.