ATP: రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్ బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్లు డీఈఓ ప్రసాద్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మండలాల ఎంఈఓలు వారి మండలాలకు సంబంధించిన విద్యా సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.