గ్రీన్ యాపిల్ తింటే పోషకాలతోపాటు ఆరోగ్యపరంగా అనేక లాభాలు పొందవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. గ్రీన్ యాపిల్లో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్రీన్ యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా, శరీరం వాపులనకు గురికాకుండా చూస్తాయి. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది.