TG: బీఆర్ఎస్ పాలనలో కూలిపోయే ప్రాజెక్టులు కట్టారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. గత పదేళ్లలో 14 గంటల కరెంట్ వచ్చేదని తెలిపారు. BRS హయాంలో నల్గొండ జిల్లాలో కొత్తగా ఒక ఎకరా సాగులోకి వచ్చినా.. తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. BRS పాలనలో నీళ్లు, విద్యుత్.. ఏమీ ఇవ్వలేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా కుళాయి నీళ్లు వచ్చాయని ప్రజలు చెబితే.. మరోసారి ఓట్లు అడగమని చెప్పారు. మిషన్ భగీరథలో రూ.50 వేల కోట్లు తినేశారని విమర్శించారు.