TG: దేశంలో గొప్ప సరస్వతి ఆలయంగా బాసరను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న ఆలయాలన్నీ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటికే రూ.5,400 కోట్లను పేదల ఖాతాల్లో వేశామన్నారు. సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలన్నదే మా లక్ష్యం అని తెలిపారు.