TG: బాలాపూర్ గణనాథుడి పూజా కార్యక్రమం పూర్తయింది. కాసేపట్లో లడ్డూ వేలం పాట ప్రారంభం కానుంది. ఈ వేలం పాటలో 38 మంది సభ్యులు పాల్గొననున్నారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభిస్తారు. బాలాపూర్ నుంచి చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఎంజే మార్కెట్, అబిడ్స్, లిబర్టీ చౌరస్తా మీదుగా ఏకదంతుడు ట్యాంక్ బండ్ చేరుకోనున్నాడు. బాలాపూర్ వినాయకుడి వద్ద 380 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.