విజయ్ దేవరకొండ చాలా కాలంగా ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పర్సనల్ లైఫ్‌పై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పుడు నా వయసు 35.. ఇప్పటికీ కూడా నేను సింగిల్ అంటే మీరు నమ్ముతారా’ అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో అతడు కచ్చితంగా ప్రేమలో ఉన్నాడనే విషయం అర్థం అయిపోతుంది. సింగిల్ కాదని చెప్పాడు కానీ.. ఎవరితో మింగిల్ అయ్యాడో ఇంకా విజయ్ ఓపెన్ కాలేదు.