TG: మంచు ఫ్యామిలీ వివాదం కేసు వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. మోహన్ బాబు, మనోజ్ వివాదంలో మూడు FIRలు నమోదు చేశాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయన మెడికల్ రిపోర్టు తీసుకోవాలి. మోహన్ బాబుకు నోటీసులు ఇవ్వగా.. ఈ నెల 24 వరకు సమయం కోరారు. మోహన్ బాబు వద్ద రెండు గన్స్ ఉన్నాయి. ఆయనకు మరోసారి నోటీసులు ఇస్తాం. స్పందించకపోతే అరెస్ట్ చేస్తాం’ అని అన్నారు.