AP: గుంటూరు జిల్లా కోర్టుకు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు. పోలింగ్ రోజు ఓటర్ సుధాకర్‌పై అప్పటి ఎమ్మెల్యే అయిన శివకుమార్ దాడి చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఘటనపై తెనాలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఇవాళ జిల్లా కోర్టుకు శివకుమార్ వచ్చారు.