ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి మరణం తప్పకుండా ఉంటుంది. అయితే టర్రిటోప్సిస్ డోర్ని అనే సముద్రజీవి వృద్ధాప్యంతో సంభవించే మరణాన్ని దూరం చేసుకోగలదట. ఈ జెల్లీఫిష్ వృద్ధాప్యం నుంచి మళ్లీ యవ్వనం దశకు మారి తన జీవనచక్రాన్ని ప్రారంభించగలదు. 1883లో ఈ జీవిని శాస్త్రవేత్తలు గుర్తించి పరిశోధన జరపగా.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది 4-5 మిల్లీమీటర్ల వ్యాసంలో ఉంటుందట.